Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్..

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలో నుండి చేరికలు జరుగుతున్నాయని, దానిలో భాగంగానే డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ సర్పంచ్ కిరణ్, ఉప సర్పంచ్ బాబా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు అనే నినాదంతో ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వాటి ఫలితంగానే గత సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచిన వారు, బీజేపీ, బీఅర్ఎస్ పార్టీల నుండి చేరుతున్నారని, ఇప్పటికే ఆయా గ్రామాలలో అభివృద్ధి కోసం నీదులు మంజూరు చేశానని, రాబోవు రోజుల్లో గ్రామ అభివృద్ధికి వీధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, రూరల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ గోట్టిపటి వాసు బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్యాం సన్, సర్పంచ్ కోట్ల భాస్కర్, ఎడ్ల వినోద్, సోమ్ నాథ్, డాక్టర్ శాదుల్ల, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -