Thursday, February 12, 2026
E-PAPER
Homeఖమ్మంనాడు అధ్వానం - నేడు అందుబాటులోకి 

నాడు అధ్వానం – నేడు అందుబాటులోకి 

- Advertisement -

క్రీడాకారులతో కలకలలాడుతున్న క్రీడా ప్రాంగణం 
నవతెలంగాణ – బోనకల్ 

నాడు ఆ క్రీడా ప్రాంగణం అధ్వానం. నేడు క్రీడాకారులతో కలకలలాడుతుంది ఆ క్రీడా ప్రాంగణం. నాడు పట్టించుకున్న వారే లేరు. నేడు పట్టించుకునే వారి సంఖ్య పెరిగింది. ఫలితంగా నాడు అధ్వానంగా ఉన్న క్రీడా ప్రాంగణం నేడు అందమైన క్రీడా ప్రాంగణంగా తయారు కావడంతో ఆ క్రీడా ప్రాంతం ప్రతిరోజు క్రీడాకారులతో కలకలలాడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని గ్రామ పంచాయతీలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు.

ఆనాటి ప్రభుత్వం ఉద్దేశం చాలా మంచిది అయినప్పటికీ ఆచరణలో మాత్రం అది రూపు దాల్చలేదు. కొన్ని గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడ్డ ఎక్కువ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగానే మారిపోయాయి. కెసిఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్రీడా ప్రాంగణాలు మొత్తం మూలన పడ్డాయి. ఆ విధంగా బోనకల్ మండలంలోని 22 గ్రామపంచాయతీలలో క్రీడా ప్రాంగణాల పరిస్థితి అత్యంత ధైర్యంగా తయారైంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగటంతో నూతన పాలకవర్గాలు ఏర్పడ్డాయి. దీంతో బోనకల్ మండలంలో మొట్టమొదటగా చొప్పకట్లపాలెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం క్రీడా ప్రాంగణం పై దృష్టి సారించింది.

సర్పంచ్ కాటేపల్లి అశ్విని వైస్ సర్పంచ్ పల్లా కొండలరావు, పల్లె ప్రపంచం ఫౌండేషన్ సభ్యులు క్రీడా ప్రాంగణాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముల్లకంప చెట్లతో నిండి అధ్వానంగా ఉన్న క్రీడా ప్రాంగణాన్ని పల్లె ప్రపంచం ఫౌండేషన్ గ్రామపంచాయతీ పాలకవర్గం చెట్లను ముల్లకంపను తొలగించారు. దీంతో క్రీడా ప్రాంగణం గత కొన్ని రోజులుగా క్రీడాకారులతో కలకలలాడుతుంది. రెండు మూడు రోజుల నుంచి ప్రతిరోజు క్రీడా ప్రాంగణంలోకి క్రీడాకారులు వెళ్లి తమ ఏరా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. క్రీడా ప్రాంగణాన్ని వినియోగులకు తీసుకురావడంతో క్రీడాకారులతో పటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -