ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిధుల కొరత లేదనీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఆయన ముందస్తు బడ్జెట్ కేటాయింపులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాల్లో వసతులు, మరమ్మతులు, రవాణా సౌకర్యం తదితర సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం గత బడ్జెట్లో పథకాల అమలుకు ప్రభుత్వం కేటాయించిన నిధుల అమలు తీరుపై ఒక నివేదికను రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించాలని ఆయన కోరారు.
నిధుల కొరత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



