- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంటలోపు క్షతగాత్రులకు ‘PM రాహత్’ కింద ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని ఏపీ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీరి వైద్యం ఖర్చు ఇంకా ఎక్కువైనా మిగతా మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్యసేవ కింద అందిస్తాం. రోడ్డు ప్రమాదాల బాధితులను ఆసుపత్రిలో చేర్పించే వారికిచ్చే ప్రోత్సాహకాన్ని ₹5వేల నుంచి 25వేలకు పెంచారు’ అని తెలిపారు. వీరికి పోలీసుల వైపు నుంచి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.
- Advertisement -



