– దక్కించుకున్న ఖాసీం
– ప్రకటించిన కమిషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వరావుపేట పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం మున్సిపల్ కమిషనర్ బి. నాగరాజు ఆధ్వర్యంలో రోజువారీ బహిరంగ మార్కెట్ వసూళ్లకు సంబంధించిన వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో పసుపులేటి రామస్వామి, కాండ్రకోట ఉదయ్ కుమార్, సరదే చంద్రశేఖర్, షేక్ ఖాసీం, కోలా నాగమణి లు ప్రతి ఒక్కరూ రూ.10 వేల ముందస్తు చెల్లింపు జరగలేదు. డ్రాతో వేలంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన పోటీపోటీ బిడ్డింగ్‌లో షేక్ ఖాసీం రూ.9 లక్షలు (అక్షరాలా తొమ్మిది లక్షలు)కు మార్కెట్ వసూళ్ల హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా సంత మార్కెట్‌లో ఉన్న గదుల వేలంలో పసుపులేటి ఫణీంద్ర కుమార్ రూ.62 వేల (అక్షరాలా అరవై రెండు వేల రూపాయలు)కు గదులను పొందారు. మున్సిపల్ అధికారులు వేలం పాటను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.



