కన్నాయిగూడెం సూపర్వైజర్ పుష్పావత
నవతెలంగాణ – కన్నాయిగూడెం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల ప్రత్యేక కార్యాచరణ) లో భాగంగా గురువారం కన్నాయిగూడెం కేంద్రం లోని రైతువేదికలో ఎంపీడీవో సాజిదా బేగం అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కన్నాయిగూడెం ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పవతి మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలో ఐసిడిఎస్ ద్వారా అందిస్తున్న సేవలను గూర్చి వివరించారు. అనంతరం గ్రామస్థాయిలో ఏ ఎల్ ఎం సి ఛైర్మన్ హోదాలో సర్పంచ్ లు అంగన్వాడీ కేంద్రాల పనితీరును నిరంతరంపర్యవేక్షణ చేయాలని సూచించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగము – ములుగు నుండి పరిరక్షణ అధికారి N. హరికృష్ణ మాట్లాడుతూ గ్రామస్థాయిలో బాలల సమస్యల తక్షణ పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ చైర్మన్ గా అంగన్వాడీ టీచర్లు కో కన్వీనర్ గా వివిధ వర్గాల ప్రతినిధులు సభ్యులుగా గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఉంటుందని అన్నారు.
గ్రామ బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా సర్పంచ్ లు చొరవ చూపి తమ పరిధిలోని గ్రామాల్లో తప్పకుండా నెలవారీ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలు ఏర్పాటుచేసి గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగకుండా, బాలలపై ఎటువంటి వేధింపులు లేకుండా, బాలకార్మికులు లేకుండా, ముఖ్యంగా పిల్లలు ఎవ్వరూ డ్రాపౌట్ కాకుండా అందరూ బడికి వెళ్లేలా చూడడం ద్వారా మన గ్రామాలను, మన మండలాన్ని తద్వారా మన జిల్లాను బాలలకు స్నేహపూర్వకంగా తీర్చిదిద్దుదామని కోరారు. ఈ కార్యక్రమంలోమండల తహశీల్దార్ సయ్యద్ సర్వర్ ,అగ్రికల్చర్ అధికారి ముంజ మహేష్ ,ఎంఈఓ సాంబశివరావు ,మండలంలోని వివిధ గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు మరియు వివిధ శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.



