Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక

పల్లెల్లో సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక

- Advertisement -

ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు

పల్లెల్లో పెరుకపోయిన ప్రజా సమస్యల పరిస్కారం కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మండలం ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి,మండల స్పెషల్ అధికారి తెలిపారు.గురువారం తాడిచెర్ల రైతువేదికలో ఎంపిడిఓ ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రామ సభను సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల స్థాయి అన్ని శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.ప్రభుత్వం అర్హులైన వారికి చేయుత,నూతన పింఛన్లు,రేషన్ కార్డులు,రైతు భరోసా,రైతు బీమా అందిస్తోందని తెలిపారు.మహిళలకు మహాలక్ష్మీ పథకం,వడ్డీలేని రుణాలు,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి, కల్యాణ లక్ష్మీ అందిస్తోందన్నారు.విద్యార్థులకు బ్రేక్ పాస్ట్,మధ్యాహ్న భోజనం అందిస్తోందన్నారు.ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం,వికలాంగుల విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు, సహజ సేంద్రియ వ్యవసాయం అందిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్,ఏవో శ్రీజ,  ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,సర్పంచ్లు బండారి నర్సింగం,జంగిడి శ్రీనివాస్,మేకల రాజయ్య,గడ్డం క్రాoతి,అబ్బినేని లింగస్వామి,కొండ రాజమ్మ,చంద్రగిరి సంపత్,ఎపిఎం హనుమంతరావు, ఎపిఓ హరీష్,ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు,తాళ్ల రవిందర్,అక్కల దేవేందర్,పులిగంటి రాములు,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు సారయ్య,తిర్రి అశోక్,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది,ఐకెపి సిబ్బంది,ఆర్టీఐ,ప్రజా సంఘాల నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -