Thursday, April 16, 2026
E-PAPER
Homeఖమ్మంప్రగతి నివేదిక ప్రవేశపెట్టిన ఆయా శాఖల మండల అధికారులు 

ప్రగతి నివేదిక ప్రవేశపెట్టిన ఆయా శాఖల మండల అధికారులు 

- Advertisement -

సమావేశంలో బోనకల్ ఉపసర్పంచ్ వర్సెస్ మాజీ సర్పంచ్ వాగ్వివాదం
అన్ని సహకార సంఘాల పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి 
మొక్కజొన్న కొనుగోలు పై పరిమితిని ఎత్తివేయాలి
సోలార్ ఓటిపి పై ప్రజలలో భయాందోళనలు 
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్
నవతెలంగాణ – బోనకల్ 

ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మండల కేంద్రంలోని రైతు వేదిక నందు మండల స్థాయి సమావేశం అధికారులు గురువారం  నిర్వహించారు. ఈ సమావేశానికి ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ శాఖల మండల అధికారులు సర్పంచులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ పరిపాలన అధికారులు పాల్గొన్నారు. మండల విద్యుత్ శాఖ ఏఈ తోకల మనోహర్ మాట్లాడుతూ బోనకల్ మండలాన్ని సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు అన్ని గ్రామాలలో సోలార్ విద్యుత్తు కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దీనివలన విద్యుత్తు ఆదా అవుతుందని వినియోగదారుడికి మిగిలిన విద్యుత్ అమ్ముకునే అవకాశం కూడా ఉందన్నారు. మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి మాట్లాడుతూ భూ సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కారం చేస్తామని అటువంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

మండల వైద్యాధికారిని వేముల స్రవంతి మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం తీవ్రత అధికంగా ఉందని ప్రజలు మండుటెండలో తిరగవద్దని శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య మాట్లాడుతూ మండల విద్యాశాఖలో ప్రగతి నివేదికను ప్రవేశపెట్టారు.

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కిలారు సురేష్ మాట్లాడుతూ గతంలో ఏ సంవత్సరం కూడా మొక్కజొన్నల  కొనుగోలు పై పరిమితిని విధించలేదని ప్రస్తుతం పరిమితి విధించటం వలన రైతులు చివరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పరిమితిని ఎత్తివేసి రైతుల వద్ద ఉన్న ప్రతి గింజలు కొనుగోలు చేయాలని కోరారు. మండల పరిధిలోని అన్ని సహకార సంఘాల పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన కోరారు. రావినూతల పెద్ద బీరువల్లి ముష్టికుంట్ల సహకార సంఘాల పరిధిలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆయన కోరారు. ఈ మూడు కేంద్రాలకు సంబంధించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిసిఓ కి నివేదిక తాము పంపించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ స్పందిస్తూ సమాధానం చెప్పారు.

మండల పరిధిలో అన్ని గ్రామాలలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారని ఈ సమయంలో వినియోగదారులను సోలార్ విద్యుత్ సిబ్బంది ఓటిపి చెప్పాలని ఫోన్లు చేస్తుండటంతో వినియోగదారులు భయాందోళన చెందుతున్నారని అధికారులు దృష్టికి సురేష్ తీసుకువచ్చారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో ఎవరు ఓటీపీ అడుగుతున్నారో అర్థంకాక వినియోగదారులు భయాందోళనలో చెందుతున్నారని ఆ సమస్య తలెత్తకుండా అధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను సురేష్ కోరారు. సోలార్ విద్యుత్తు 25 సంవత్సరాలు పాటు పనిచేస్తుందని విద్యుత్ అధికారులు ప్రకటించారని, కానీ సోలార్ విద్యుత్ కలెక్షన్ ఇచ్చే సమయంలో ఎర్త్ వైర్ లోప భూయిష్టంగా వేస్తున్నారని, ఎర్త్ వైర్ ను బహిరంగంగా వేస్తున్నారని అన్ని గ్రామాలలో ప్రస్తుతం కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఈ కోతులు వలన ఈ ఎర్త్ వైర్ దెబ్బ తినే ప్రమాదం ఉందని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.

ఎర్త్ వైర్ ను బహిరంగంగా కాకుండా భద్రతా చర్యలు తీసుకుంటూ వేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా బోనకల్ మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం బోనకల్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏర్పాటుచేసిన శిలాఫలకంలో ఆనాటి ఎంపీటీసీ పేరు జి శ్రీనివాసరావు ఉందని, కానీ ప్రస్తుత పాలకవర్గం ఎంపీటీసీ పేరు గంగుల శ్రీనివాసరావు అని కొత్తగా కొట్టించారని అధికారులు దృష్టికి తీసుకెళ్లాడు. ఆనాటి పాలకవర్గం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని నేటి పాలకవర్గం మార్చటం పద్ధతి కాదని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధంగా శిలాఫలకాలు మార్చడం అంటే గత పాలకవర్గాన్ని అవమానపరచడమేనని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బోనకల్ ఉపసర్పంచ్ బానోతు కొండ మాట్లాడుతూ ఆనాటి ఎంపీటీసీ తన పేరును జి శ్రీనివాసరావు అని రాశారని, కానీ అందరి పేర్లు పూర్తిగా రాశారని, తన పేరును కూడా పూర్తిగా శిలాఫలకంపై రాయాలని వినతి పత్రం తమకు అందజేశారని తెలిపారు.

పాలకవర్గంలో చర్చించి అందరి ఆమోదం తర్వాతనే శిలాఫలకం పై పేరు మార్చినట్లు కొండ తెలిపారు. ఈ సమయంలోనే పోటు వెంకటేశ్వర్లుకు, బానోతు కొండకు కొద్దిసేపు మాటల యుద్ధం కొనసాగింది. తాను సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నానని పోటు వాదించారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం సాగింది. ఆ సమయంలో మండల అధికారులు అందరూ వేదికపై ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోవడం విశేషం. పలుక మండల ప్రత్యేక అధికారి కడారు విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిజ్ఞను చదివి వినిపించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ కార్యాలయ సూపరిండెండెంట్ మిట్టపల్లి రవికుమార్, ఐకెపిఐపిఎం కొట్టే వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ పంతంగి రమాదేవి, సిపిఐ మండల కార్యదర్శి ఎంగల ఆనందరావు, సిఐటియు మండల కన్వీనర్ గుగులోతు నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -