Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రేమ వివాహం చేసుకున్న మహిళకు రక్షణ కల్పించాలి

ప్రేమ వివాహం చేసుకున్న మహిళకు రక్షణ కల్పించాలి

- Advertisement -

మానవ హక్కుల కమిషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రేమ వివాహం చేసుకున్న మహిళకు రక్షణ కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది. గురువారం డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ అధ్యక్షతన తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ మహేష్‌ ఫిర్యాదును పరిశీలించింది. జనవరి 30న యాదగిరిగుట్ట ఆలయంలో భాగ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి, బావ కల్వకుర్తి సమీపంలోని ఆస్పత్రిలో ఆమె నాలుగు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించారనీ, తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందనీ, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్న ఆరోపణలను కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది.

స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని కమిషన్‌ పేర్కొన్నది. కల్వకుర్తి సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి వంగూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలను తక్షణమే ఫిర్యాదుపై స్పందించి చట్టప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలనీ, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో వ్యవహారాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ విషయంపై ఈ నెల 26 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని హక్కుల కమిషన్‌ ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -