Thursday, June 11, 2026
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్ హైక‌మాండ్ కీల‌క భేటీ

కాంగ్రెస్ హైక‌మాండ్ కీల‌క భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ అత్యవసరంగా సమావేశమవుతోంది. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ్య నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చిన అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుందని, దీనికి సంబంధించి భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -