నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఇరాన్ లోని పలు కీలక ప్రాంతాలపై క్షిపణులతో దాడి చేస్తోంది. యూఎస్ దాడులకు ప్రతిదాడులకు దిగింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ సేనలు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జల సంధిని మూసివేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఈ జల మార్గం గుండా రాకపోకలు సాగిస్తే..తగిన మూల్యం చెల్లించుకుంటారని IRGC తన అధికారిక టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నట్లు CNN ఉటంకించింది.
మరో వైపు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అదనపు ఆత్మరక్షణ దాడులను ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ప్రకటించింది. దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు ‘X’ వేదికగా వెల్లడించారు.



