• ఉరివేసుకుని ఒకరు మృతి
నవతెలంగాణ-పెద్దవంగర: పెద్దవంగర గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఓ యువకుడు తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. పెద్దవంగర గ్రామానికి చెందిన రాయారపు రమేష్ (50) తనకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించగా ఆయన అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనకు సంబంధించి మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెద్దవంగర గ్రామంలో విషాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



