నవతెలంగాణ-పెద్దవంగర: అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో జరిగింది. ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ కు చెందిన పటేరు ఉపేందర్ కుమార్తె స్వప్న (35), పోచారం గ్రామానికి చెందిన కాలేరు ముఖేష్ ను 2011లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వప్నకు 2014లో మొదటి సంతానం జన్మించిన తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తరచూ మూర్ఛవ్యాధి (ఫిట్స్) రావడంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడలేదు. దీంతో ఆమె తరచూ మనస్తాపానికి గురవుతూ ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వప్న ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు హన్మకొండ లోని ఆసుపతకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఎలుకల మందు తాగి మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



