నవతెలంగాణ-హైదరాబాద్: నేడు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ 11వ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు, సభ్యులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి కూడా పాల్గొన్నారు.
కాగా, ఈ సమావేశానికి కేంద్రహోం శాఖా మంత్రి అమిత్షా, రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం సిఎం హిమంత బిశ్వశర్మ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఢిల్లీ నుంచి రేఖా గుప్తా, హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వీరితోపాటు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సిఎం సువేందు అధికారి, తమిళనాడు సిఎం విజయ్, కర్ణాటక సిఎం డి.కె శివకుమార్, కేరళ నుంచి విడి సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్ వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవాభివృద్ధి’. ఈ అంశంతోపాటు పార్రిశామికతపై కూడా చర్చించనున్నారని నీతి అయోగ్ ప్రకటన పేర్కొంది.



