నవతెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సీకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్మార్ట్ పాఠశాల వైపు అడుగులు వేసి రూపుదిద్దుకొందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయురాలు గీత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల అన్ని రకాల వసతులతో స్మార్ట్ స్కూల్‌గా రూపుదిద్దుకొని రానున్న విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠశాల ఆహ్వానం పలుకుతుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో లభించే అన్ని రకాల ఉచిత వసతులతో పాటు ప్రత్యేకంగా హెచ్‌డీఏస్‌సి బ్యాంక్,రాంకి ఫౌండేషన్ సౌజన్యంతో డిజిటల్ క్లాసులు,లైబ్రరీ,ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్,ఫర్నిచర్ లాంటి అదనపు సౌకర్యాలతో అంకిత భావంగల ఉపాధ్యాయుల పనితీరుతో నాణ్యమైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
అంతేకాకుండా గ్రామ సర్పంచ్,తల్లిదండ్రుల సహకారంతో ఈ విద్యా సంవత్సరం పిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు.ఆర్థిక భారం,దూరాభారం వంటి విషయాలతో సంబంధంలేని మన ఊరి బడికి పిల్లలను పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.



