నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన అధికారులతో సమాక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్& రిజిస్ట్రేషన్ ఐ.జి. రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు గౌరవప్రదమైన సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి దశలో భాగంగా 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఒకే నమూనాలో కొత్త భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో అద్దె ఇళ్లలో, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తుది డిజైన్లను ఖరారు చేస్తామని తెలిపారు. భవన నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



