శ్రీలంక అండర్19
సిరీస్‌కు ఎంపిక
ముంబయి : తెలంగాణ కుర్రాడు, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉట్కూరి యశ్‌వీర్ గౌడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ తరఫున దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణించిన యశ్‌వీర్ గౌడ్ జులై 4 నుంచి ఆరంభం కానున్న శ్రీలంక పర్యటనకు భారత అండర్-19 జట్టు తరఫున వెళ్లనున్నాడు. యశ్‌వీర్ గౌడ్ తల్లితండ్రులు రాజకుమార్ గౌడ, వాణి. వీరి స్వస్థలం భువనగరి జిల్లా రాజాపేట్. కానీ ఎంతోకాలంగా యశ్‌వీర్ కుటుంబం హైదరాబాద్‌లోనే స్థిరపడింది. యశ్‌వీర్ తొలినాళ్లలో విద్యానగర్‌లోని డానియెల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ప్రస్తుతం కోచ్ కృష్ణ మోహన్ పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. ఇటీవల టీజీ20 లీగ్ ఆటగాళ్ల వేలంలో సీ2 కేటగిరీ ఆటగాడు యశ్‌వీర్ గౌడ్‌ను హైదరాబాద్ ఈ చాంపియన్స్ ప్రాంఛైజీ రూ.3 లక్షల ధరకు సొంతం చేసుకుంది.
శ్రీలంక పర్యటనలో భారత అండర్-19 జట్టు మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. యశ్‌వీర్ గౌడ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అండర్19 జట్టుకు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ సైతం ఎంపికయ్యాడు.
శ్రీలంక పర్యటనకు
భారత అండర్19 జట్టు
సాగర్ వీర్క్, లక్ష్య రాయ్‌చందని (వైస్ కెప్టెన్), యశ్‌బర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వికె, అర్జున్ రాజ్‌పుత్, కుశాగ్ర ఓజా, రజత్ బగెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్),అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉట్కూరి యశ్‌వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేశ్ పటేల్, మోహిత్, ఇషాన్ సూద్.
అండర్19 జట్టులో యశ్‌వీర్ గౌడ్
- Advertisement -
- Advertisement -



