Monday, September 7, 2026
E-PAPER
Homeజాతీయంఎవరిని ఒంటరిని చేయం: సీజేపీ

ఎవరిని ఒంటరిని చేయం: సీజేపీ

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: తమతో కలిసి పోరాడిన ఏ నిరసనకారుడిని ఒంటరిని చేయబోమని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులతో సోమవారం అర్ధరాత్రి చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని వారు తమకు హామీ ఇచ్చారన్నారు. బిహార్, అస్సాంలో ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఆయా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయని తెలిపారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయడంపైనా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనకారులపై రేపటిలోగా కేసులు ఎత్తివేయాలని కోరామన్నారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -