- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) మృతి చెందారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన దీపారెడ్డి, ఆమె భర్త రామకృష్ణారెడ్డి 20 ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. దీపారెడ్డి కారు సిగ్నల్ వద్ద ఆగి ఉన్నప్పుడు, మరో కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- Advertisement -



