- Advertisement -
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, డోంగ్లి ,జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్ గల్, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల పరిధిలోని 2,06,343 మంది ఓటర్ల ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ మంగళవారం నాటికి 90 శాతం పూర్తయ్యిందని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, మద్నూర్ తహశీల్దార్ ఎండి.ముజీబ్ తెలిపారు. మండలాల వారీగా మద్నూర్ 89.10%, డోంగ్లి 91.69 %, జుక్కల్ 89.78 %, బిచ్కుంద 86.38%, పెద్ద కోడప్ గల్ 89.38%, పిట్లం 88.37%, నిజాంసాగర్ 92.54%, మహమ్మద్ నగర్ 90.01%, పూర్తైనట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 3 వరకు 100 % పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -



