Monday, September 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ దురాగతాలను తిప్పికొడదాం

ఇజ్రాయిల్‌ దురాగతాలను తిప్పికొడదాం

- Advertisement -


హిజ్బుల్లా, హమాస్, హూతీలతో చేయి కలిపిన ఇరాన్‌
టెహ్రాన్:
అమెరికాతో కలిసి..తమ దేశంపై యుద్ధోన్మాదానికి దిగిన ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ ఎదురు చూస్తోంది. తమ దేశాధినేతల మరణానికి కారణమైన వారిని అంతం చేస్తామని పలుమార్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌ నిఘా వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. తమ దేశంపై భారీ స్థాయిలో దాడులు చేపట్టడానికి ఇరాన్‌ ప్రణాళిక రచిస్తున్నట్టు ఇజ్రాయిల్‌ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అన్ని వైపుల నుంచి ఏకకాలంలో తమను లక్ష్యం చేసుకోవడానికి ఇరాన్‌.. హిజ్బుల్లా, హమాస్, హూతీలు, ఇరాక్‌లోని సాయుధ ముఠాల తో జట్టు కడుతోందని ఆరోపించాయి. భవిష్య త్తులో జరగబోయే ఈ దాడి 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడికంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపాయి. ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ తన బలగాలను లెబనాన్‌లోని హెజ్బుల్లా, హమాస్, యెమెన్‌లోని హూతీలతో కలిపి మోహరించాలని భావిస్తున్నట్టు వెల్లడించాయి. దీంతో ఇజ్రాయిల్ ప్రధాని వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
నిఘా వర్గాల ప్రకారం.. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. దీంతో ఈసారి మిత్రదేశాలతో కలిసి.. ఇజ్రాయిల్‌పై దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేయాలనేది వారి ప్లాన్‌. ఈ పరిస్థితులకు హమాస్‌ నాయకత్వంలో వచ్చిన మార్పు కూడా ఓ కారణం. జులైలో హమాస్ అత్యున్నత నాయకుడిగా ఎన్నికైన ఖలీల్ అల్-హయ్యాకు ఇరాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇజ్రాయిల్‌పై పగ తీర్చుకోవడానికి ఇరువురు ఏకమయ్యాయి. ఈ దాడి కోసం ఇరాన్‌ కొన్ని బృందాలను, సమన్వయ యంత్రాంగాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత వేగంగా ఆయుధాల ఉత్పత్తి
ఇజ్రాయిల్‌తో ఘర్షణను విస్తరించడంపై హిజ్బుల్లా, హూతీలు, ఇరాకీ మిలీషియాలలోని కమాండర్లతో ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఐఆర్‌జీసీకి చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు, ఖుద్స్ ఫోర్స్ సీనియర్ అధికారులు, ఇతర కమాండర్లతో కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించారు. అలాగే ఇరాన్ సలహాదారులు కూడా క్షేత్రస్థాయిలో వారితో కలిసి పనిచేశారు. అదే సమయంలో క్షిపణులు, డ్రోన్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి, దెబ్బతిన్న అణు సామర్థ్యాలను పునరుద్ధరించడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -