Monday, September 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబద్దలైన అగ్నిపర్వతం

బద్దలైన అగ్నిపర్వతం

- Advertisement -

50వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడిన బూడిద!
ఇండోనేసియాలో ప్రకృతి విపత్తు
అగ్నిపర్వతం నుంచి వెలువడిన దట్టమైన పొగ, బూడిద
అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు రద్దు
జకార్త :
ఇండోనేసియాను మరోసారి ప్రకృతి విపత్తు భయాందోళనకు గురిచేస్తోంది. జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సుండా జలసంధిలోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవా రుజామున భారీగా విస్ఫోటనం చెందింది. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దట్టమైన పొగ, బూడిద ఆకాశాన్ని కమ్మేశాయి. బూడిద మేఘాలు ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు ఎగసిపడటంతో జకార్తా సహా పలు ప్రాంతాలపై ప్రభావం పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన రాకపోక లపై ఆంక్షలు విధించారు. ఇండోనేసియా జియో లాజికల్ ఏజెన్సీ ప్రకారం, అనక్ క్రాకటౌ అగ్ని పర్వతం శుక్రవారం నుంచే క్రియాశీలత సంకేతా లను చూపించింది. ఆదివారం తెల్లవారు జామున 3.53 గంటలకు సుమారు 30 సెకన్ల పాటు విస్ఫో టనం సంభవించింది. అగ్నిపర్వతం వద్ద లావా జ్వాలలు ఎగసిపడుతున్న దృశ్యాలను అక్కడ ఏర్పా టు చేసిన క్లోజ్డ్- సర్క్యూట్ కెమెరాలు రికార్డు చేశాయి. విస్ఫోటనం తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రజల ను పెద్దఎత్తున తరలిం చాల్సిన పరిస్థితి కూడా ఏర్ప డలేదు. అగ్నిపర్వ తానికి సమీపంలోని జనావా సాలు 16 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండటం తో తక్షణ ముప్పు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
3 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లొద్దు
అనక్ క్రాకటౌ క్రియాశీల బిలం నుంచి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాలని అధికా రులు స్థానికులు, పర్యాటకులను హెచ్చరించారు. అగ్నిపర్వత కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జకార్తాతో పాటు సుమత్రా ద్వీపంలోని లాంపుంగ్ ప్రావిన్స్‌ లోని కొన్ని ప్రాంతాలకు బూడిద వ్యాపించింది. బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలపై కూడా బూడిద మేఘాల ప్రభావం కనిపించింది. గాలుల దిశకు అనుగుణం గా బూడిద మేఘాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
విమాన రాకపోకలకు అంతరాయం
అగ్నిపర్వత బూడిద విమాన ప్రయాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో జకార్తాలోని సోకార్నో- హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయం ఆదివారం తెల్లవా రుజామున 5.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రయాణి కులకు సమాచారం ఇచ్చింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో విమానాల రద్దులు, ఆలస్యాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. కొందరు ప్రయా ణికులు టికెట్ డబ్బులు తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, మరికొందరు చెక్ చేసిన సామాను కోసం వేచి చూడాల్సి వచ్చింది.

22,800 మంది ప్రయాణికులపై ప్రభావం
సుకార్నో- హట్టా విమానాశ్రయంలో రాత్రిపూట నిలిపి ఉంచిన సుమారు 170 విమా నాలు ఆప్రాన్‌లపైనే ఉన్నట్లు ఇండోనేషియా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. విమానా శ్రయ కార్యకలాపాల నిలిపివేత కారణంగా ఆదివా రం సుమారు 209 విమాన రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. దాదాపు 22,800 మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడింది. మకాసర్‌కు వెళ్లే రద్దీ దేశీయ మార్గంతో పాటు లాంపుంగ్, బాలి, సురబయ ప్రాంతాలకు వెళ్లే కొన్ని విమానాలు రద్దయ్యాయి, మరికొన్నింటి దారిని మళ్లించారు. అంతర్జాతీయంగా సింగపూర్‌ వెళ్లే విమానాలపై ఎక్కువ ప్రభావం కనిపించింది. హాంగ్‌కాంగ్, సిడ్నీ, ఆమ్‌స్టర్‌డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ మార్గాల్లోనూ రద్దులు, ఆలస్యాలు నమోదయ్యాయి.

భద్రతే ప్రథమ ప్రాధాన్యత
విమాన ప్రయాణాలపై విస్ఫోటనం ప్రభావాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని ఇండోనేషియా పౌర విమానయాన అధికారులు తెలిపారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు, విమాన సేవల విభాగాలు, వాతావరణ సంస్థలతో సమన్వ యం చేస్తున్నట్లు వెల్లడించారు. “ప్రతి కార్యాచరణ నిర్ణయంలోనూ భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత” అని రవాణా మంత్రిత్వ శాఖ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ లుక్మాన్ ఎఫ్. లైసా తెలిపారు. విమాన యాన సంస్థలు కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, షెడ్యూళ్లలో వరుస మార్పులు, ఆలస్యాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తాజా విమాన సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదిం చాలని ప్రయాణికులకు సూచించారు. అత్యవసర పరిస్థితి లేకపోతే కొంత కాలం విమానాశ్రయానికి రావొద్దని కూడా అధికారులు కోరారు.

1883 నాటి విస్ఫోటనానికి!
“క్రాటకౌ బిడ్డ” అని అర్థం వచ్చే అనక్ క్రాకటౌ, ప్రసిద్ధ క్రాకటౌ అగ్నిపర్వతం నుంచి ఏర్పడిన కొత్త అగ్నిపర్వత ద్వీపం. 1883లో క్రాకటౌలో సంభవిం చిన భారీ విస్ఫోటనం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఆ విస్ఫోటనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ప్రపంచ వ్యాప్తంగా శీతలీకరణ ప్రభావం కనిపించింది. 2018లో అనక్ క్రాకటౌ కార్యకలాపాల కారణంగా సంభవించిన సునామీలో సుమత్రా, జావాల్లో కనీసం 430 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా నీటి అడుగున కొండచరి యలు విరిగిపడి, అనక్ క్రాకటౌ నైరుతి వాలులోని భారీ భాగం సముద్రంలోకి కూలిపోవడంతో పెద్ద మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ ఏర్పడిందని పరిశోధకులు భావించారు.

50 వేల అడుగుల ఎత్తుకు బూడిద
ఇండోనేసియా అగ్నిపర్వత శాస్త్ర సంస్థతో పాటు ఆస్ట్రేలియాలోని డార్విన్ అగ్నిపర్వత బూడిద సలహా కేంద్రం ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి రెండు ప్రధాన బూడిద మేఘాలను గుర్తించాయి. ఒకటి ఈశాన్య దిశగా కదులుతూ సుమారు 20 వేల అడుగుల ఎత్తుకు చేరింది. దీని ప్రభావం జకార్తా, బాంటెన్, పశ్చిమ జావాలోని కొన్ని ప్రాంతాలు, చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలపై పడింది. మరో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ బాంటెన్, లాంపుంగ్, బెంగులు ప్రావిన్స్‌లలోని కొన్ని ప్రాంతాలను కప్పేసింది. దక్షిణ సుండా జలసంధి, సుమత్రాకు పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలపైనా దీని ప్రభావం కనిపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -