Monday, September 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసభ్య కామెంట్‌ చేసిన 
పోలీస్‌‌ను అరెస్టు చేయండి

అసభ్య కామెంట్‌ చేసిన 
పోలీస్‌‌ను అరెస్టు చేయండి

- Advertisement -


డీజీపీ పరీక్ష పాస్‌ అయ్యి వచ్చావా? 
రికమండేషన్‌‌తో వచ్చావా?
సీఎం ఉద్యమకారులను వాడుకుని మోసం చేశారు టీఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ కవిత ఫైర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తనపై అసభ్య కామెంట్‌ ‌చేసిన పోలీస్‌‌ను వెంటనే అరెస్టు చేయాలని టీఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ కవిత డిమాండ్‌ ‌చేశారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని టీఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 20 ఏండ్లు ప్రజాజీవితంలో ఉండి ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేసిన తనపై అసభ్యంగా కామెంట్లు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. తనకే ఇలాగైతే సామాన్య మహిళలకు ఇబ్బందులు వస్తే వాళ్లు ఎవరికీ చెప్పుకుంటారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా దూషించిన ఓ పోలీస్‌‌ను సస్పెండ్ చేసి డీజీపీ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అతన్ని ఎందుకు రిమూవ్‌ ‌చేయలేదు? ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు? మహిళలకు సంబంధించి భారత న్యాయ సంహితలో సెక్షన్లు డీజీపీకి తెలియదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలపై అసభ్యంగా కామెంట్స్ చేస్తే మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని ఐటీ చట్టంలో ఉందని గుర్తుచేశారు. నక్సలైట్లు పోయిన తర్వాత గంజాయి పెరిగిందని స్మగ్లింగ్‌ ‌పెరిగిందని అనడానికి డీజీపీ సిగ్గుపడాలన్నారు. హేట్‌ ‌స్పీచ్‌‌పై ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని డిమాండ్‌ ‌చేశారు. రేవంత్‌‌రెడ్డిని ఉద్యమకారులు నమ్మట్లేదన్నారు. ఆయన పక్కనే కోదండరాం సార్ ఉండటంతోనే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారని తెలిపారు. ఉద్యమకారులపై లాఠీ ఝళిపిస్తే ఏం వస్తుంది? అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, ఈ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాలపై కేంద్రంతో కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీకి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లట్లేదని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీయే వాళ్ల కోసం ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్రం చేసే కులగణనలో కులం కాలాన్ని పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -