నౌకలపై అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు
దుబాయి : మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ సేనల మధ్య ‘జల’ పోరాటం తీవ్రమవుతోంది. టెహ్రాన్ పరిసరాల్లోని జలాల్లో ప్రయాణిస్తున్న నౌకలపై శనివారం ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు నౌకలపై అమెరికా దాడి జరపగా హార్ముజ్‌లో అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఖర్గ్ దీవి తీరంలో ప్రయాణిస్తున్న ఓ నౌక సహా మొత్తం మూడు ఇరాన్ నౌకలపై దాడి చేశానని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలియజేసింది. అంతకుముందు అమెరికా నేవీకి చెందిన రెండు నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఐఆర్‌జీసీకి మేము స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాం. మీరు మా దేశానికి చెందిన రెండు నౌకలపై దాడి చేస్తే మేము మీ దేశానికి చెందిన మూడు నౌకలపై దాడి చేసి అంతకంటే ఎక్కువగా మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాం’ అని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధినేత అడ్మిరల్ బ్రాడ్ కూపర్ హెచ్చరించారు.
సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా సైనిక నౌకలపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు జరిపింది. మూడు ట్యాంకర్లపై, అలాగే అమెరికాకు సంబంధించిన మరో మూడు నౌకలపై దాడులు జరిపామని తెలిపింది. ‘ఉగ్రవాద అమెరికా సైన్యం మాటలు విని మోసపోకండి. అనధికార జలమార్గం మీదుగా ప్రయాణించే నౌకలకు దూరంగా ఉండండి. లేకుంటే మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు’ అని ఇరాన్ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ ప్రకటనలో ఐఆర్జీసీ నౌకాదళం హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఖర్గ్ నౌకాశ్రయం ప్రాంతంలో ఓ ట్యాంకర్‌పై నాలుగు అమెరికా క్షిపణులు దాడి చేశాయని ఇరాన్ అధికార వార్తా సంస్థ తస్నిమ్ తెలియజేసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ట్యాంకర్ సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్పింది.
మధ్యప్రాచ్యంలో ‘జల’పోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



