Friday, June 12, 2026
E-PAPER
Homeఆటలుఆసియా క్రీడలకు ఇషా సింగ్‌

ఆసియా క్రీడలకు ఇషా సింగ్‌

- Advertisement -

న్యూఢిల్లీ : 2026 ఆసియా క్రీడలకు హైదరాబాదీ అమ్మాయి, భారత యువ షూటర్‌ ఇషా సింగ్‌ ఎంపికైంది. ఇటీవల మ్యూనిచ్‌‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ‌ప్రపంచకప్‌‌లో వరల్డ్‌ ‌రికార్డుతో పసిడి పతకంతో సత్తా చాటిన ఇషా సింగ్‌.. 30 మందితో కూడిన ఆసియా క్రీడల భారత షూటింగ్‌ ‌జట్టులో చోటు సాధించింది. జపాన్‌ ‌వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 ‌వరకు 20వ ఆసియా క్రీడలు జరుగనున్నాయి. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ జట్ల సెలక్ష‍న్‌‌కు మార్గదర్శకాలు రూపొందించగా.. అందుకు అనుగుణంగా మహిళల విభాగంలో 15 మంది షూటర్లు, పురుషుల విభాగంలో 15 మంది షూటర్లను ఎంపిక చేశారు. ఇషా సింగ్‌, మను భాకర్‌, విదర్శ కె వినోద్‌, రుద్రాంక్ష‍ బాలాసాహెబ్‌ ‌పాటిల్‌లు రెండేసి విభాగాల్లో పోటీపడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -