- Advertisement -
హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) ప్రాంఛైజీ హైదరాబాద్ హీరోస్ రెండో సీజన్‌కు తమ జట్టు కెప్టెన్‌గా స్పెయిన్ ఆటగాడు మాన్యువల్ మోరెనోను ప్రకటించింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 16 నుంచి రెండో సీజన్ ఆరంభం కానుండగా.. పసిడి పతకమే లక్ష్యంగా హైదరాబాద్ హీరోస్ బరిలోకి దిగుతోందని ఆ ప్రాంఛైజీ యజమాని శ్రీనాథ్ చిత్తూరి అన్నారు. రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్, తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర రామ్ హైదరాబాద్ హీరోస్ జెర్సీని ఆవిష్కరించారు.
- Advertisement -



