- Advertisement -
నవతెలంగాన – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు సజీవదహనం అవ్వగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



