Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు..

తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వానలు మాత్రమే కాదు కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇవాళ తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. శనివారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇటు బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -