Saturday, February 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండిస్కంల నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోండి

డిస్కంల నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోండి

- Advertisement -

విద్యుత్‌ అధికారులకు సీఎస్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు అధికారులకు సూచించారు. దర్తి ఆబా జన జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ డీపీఆర్‌ను ఆమోదించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్కరణల కమిటీ రెండో సమావేశం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా వారికి సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివద్ధి, వ్యవసాయ ఉత్పాదకత, మొత్తం సామాజిక-ఆర్థికాభివద్ధికి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్‌ వ్యవస్థ బలోపేతం, సాంకేతిక, వాణిజ్య నష్టాలను తగ్గించడం, స్మార్ట్‌ మీటరింగ్‌ అమలు, ఫీడర్‌ విభజన, మౌలిక సదుపాయాల పెంపుదల, పంపిణీ నెట్‌వర్క్‌ల డిజిటలైజేషన్‌ వంటి కీలక అంశాలపై దష్టి సారించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై అధికారులు సీఎస్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -