Thursday, August 13, 2026
E-PAPER
Homeజాతీయంమమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్

మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్‌కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. గత మార్చిలో ధర్మతలలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మమత చేసిన వ్యాఖ్యలు మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సమాజంలో భయాందోళనలు, వైషమ్యాలు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. మే నెలలో ఫిర్యాదు అందగా, తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -