Saturday, February 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి

అమెరికాలో అదృశ్యమైన కర్ణాటక విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. కాలిఫోర్నియాలోని ప్రతిష్ఠాత్మక బర్కిలీ విశ్వవిద్యాలయంలో (యూసీ బర్కిలీ) చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య (22) అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. కర్ణాటకకు చెందిన సాకేత్, ఈ నెల 10వ తేదీ నుంచి కనిపించడం లేదని స్థానిక అధికారులు తెలిపారు. ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన సాకేత్, ప్రస్తుతం యూసీ బర్కిలీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు.

బర్కిలీ పోలీసులు అతడిని ‘at-risk’ మిస్సింగ్ పర్సన్‌గా ప్రకటించి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సాకేత్ అదృశ్యం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, అతడి కుటుంబ సభ్యులతోనూ, స్థానిక అధికారులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. సాకేత్ చివరిసారిగా బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌తో కూడిన బ్యాగ్‌ను ఓ ఇంటి ముందు గుర్తించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -