Saturday, February 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదేవునికి పెట్టిన దీపం అంటుకుని షాప్ దగ్ధం

దేవునికి పెట్టిన దీపం అంటుకుని షాప్ దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్‌ జిల్లా మంగపేట మండలం మల్లూరు మైసమ్మ సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. దేవునికి పెట్టిన దీపం కారణంగా పాన్ షాప్ దగ్ధమై ఓ పేద కుటుంబం జీవనోపాధి కోల్పోయింది. బాధితులు అబ్బు వెంకటేశ్వర్లు, పద్మ దంపతులు. శనివారం ఉదయం వారు పూజ కోసం వెలిగించిన దీపం వల్ల మంటలు వ్యాపించడంతో డబ్బాలో ఉన్న పెట్రోల్ సీసాలు, గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు సమాచారం ఇచ్చేలోపే షాప్ పూర్తిగా కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -