విజేతకు రూ.20కోట్లు
భారీగా ప్రైజ్ మనీని పెంచిన ఐసీసీ
లండన్: ఒకప్పుడు పురుషుల క్రికెట్ మాత్రమే క్రేజ్ ఉండగా.. ప్రస్తుతం మహిళా క్రికెట్‌కు కూడా ఆ స్థాయి ఆదరణ పెరిగింది.దీంతో ఐసీసీ మహిళా టీ20వరల్డ్ కప్ 2026టోర్నీలో అందజేసే నగదును భారీగా పెంచేసింది.ఇంగ్లండ్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ నగదు వివరాలను ప్రకటించింది.ఛాంపియన్‌గా నిలిచి టైటిల్ గెలుచుకునే జట్టుకు ఏకంగా 2.34మిలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ.22కోట్లు)నగదు ఇవ్వనున్నట్లు తెలిపింది.అలాగే రన్నరప్‌గా నిలిచే జట్టుకు1.17మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11కోట్లు)అందజేయనున్నట్లు పేర్కొంది. అలాగే టోర్నీలో ఆడే ప్రతి జట్టుకూ భారీ ప్యాకేజీని ప్రకటించింది.ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే మొత్తం12జట్లకు ఒక్కో జట్టుకు 247,500 డాలర్లు(దాదాపు రూ.2కోట్లు) పార్టిసిపేషన్ బహుమతి కింద ఇవ్వనున్నట్లు, సెమీఫైనల్స్ వరకు వచ్చిన జట్లకు కూడా తలా రూ.6.56కోట్ల చొప్పున భారీ నగదు దక్కనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈసారి జరిగే టోర్నీ ఉమెన్స్ టీ20వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా నిలవనుంది.ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి రికార్డు స్థాయిలో మొత్తం12జట్లు ఈ మెగా సమరంలో పోటీపడుతున్నాయి.
భారత్ తలపడే మ్యాచ్ ల షెడ్యూల్…
టి20ప్రపంచకప్ లో భారత మహిళలజట్టు పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో టైటిల్ వేటను ప్రారంభించబోతోంది.జూన్14న జరిగే ఈ మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్ ఆతిథ్యమివ్వనుంది.జూన్12నుంచి జులై 5వరకు ఇంగ్లండ్,వేల్స్ వేదికగా మొత్తం 12జట్లు తలపడుతున్నాయి.టీమిండియా గ్రూప్-1లో ఉండగా..ఇదే గ్రూప్‌లో బలమైన ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.ఇటీవల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఉమెన్ ఇన్ బ్లూ..ఇప్పుడు టి20ప్రపపంచకప్ సాధించి చరిత్ర సృష్టించాలని చూస్తోంది.ఇప్పటివరకు భారత మహిళల జట్టు ఐదుసార్లు సెమీఫైనల్‌కు చేరినప్పటికీ..ఒక్కసారీ కప్‌ను ముద్దాడలేకపోయారు.
భారత్ ఆడే మ్యాచ్ ల షెడ్యూల్
14(ఆది) : ఇండియా×పాకిస్తాన్ఎడ్జ్ బాస్టన్రా.7.00గం||లకు
17(బుధ): ఇండియా× నెదర్లాండ్స్హెడింగ్లీరా.7.00గం||లకు
21(ఆది) : ఇండియా×దక్షిణాఫ్రికాఓల్ట్ ట్రఫోర్డ్రా.7.00గం||లకు
25(గురు):ఇండియా×బంగ్లాదేశ్ఓల్ట్ ట్రఫోర్డ్రా7.00గం||లకు
28(ఆది): ఇండియా× ఆస్ట్రేలియాలార్డ్స్రా.7.00గం||లకు



