నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ధమ్తారి జిల్లాలో బైపాస్ ఖాప్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్, ముగ్గురు సిఆర్పిఎఫ్ సిబ్బందితో సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సిఆర్పిఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం జగ్దల్పూర్ నుంచి రారుపూర్కి సిఆర్పిఎఫ్ సిబ్బందితో వెళుతున్న వాహనం బైపాస్ ఖాప్రి రోడ్డుపై కారును ఢికొీట్టింది.
ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు సివిల్ సర్జన్ అభిషేక్ తోండర్ తెలిపారు. ఒకరు తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతున్నారని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న ప్రమాదానికి గురైన కారును, సిఆర్పిఎఫ్ వాహనాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



