Saturday, February 14, 2026
E-PAPER
HomeఆటలుT20 World cup: ఒమన్‌ పై ఐర్లాండ్‌ ఘన విజయం

T20 World cup: ఒమన్‌ పై ఐర్లాండ్‌ ఘన విజయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఓపెన‌ర్లను స్వ‌ల్ప ప‌రుగుల‌కే ఔటైనా.. సెకండౌన్ లో వ‌చ్చిన బ్యాట‌ర్లు దుమ్మురేపారు. ఎల్ జే ట్యూకర్ 51 బంతుల్లో (10 ఫోర్లు, 4 సిక్స్) 94 ర‌న్స్‌తో క‌దంతొక్కాడు. చివ‌ర వ‌ర‌కు క్రీజులో నిలిచి ఐర్లాండ్ కు రికార్డు స్కోర్ సాధించారు. అనంతరం ఛేదనలో ఒమన్‌ తడబడింది. 18 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. ఒమన్‌ బ్యాటర్లలో అమీర్‌ కలీమ్‌ (50), హమ్మద్‌ మీర్జా (46) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఐర్లాండ్‌ బౌలర్లలో జాషువా లిటిల్‌ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మాథ్యూ హంఫ్రీస్‌, బారీ మెక్‌కార్తీ 2, జార్జి డాక్రెల్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -