అనగనగా రామాపురం అనే ఊరిలో మనోజ్ అనే పిల్లవాడు అదే ఊరిలో ఉన్న పాఠశాలలో 9 వ తరగతి చదివేవాడు. మనోజ్ అన్నింట్లో ముందుండేవాడు. అందరూ అతన్ని మెచ్చుకునేవారు. చిన్న చిన్న తప్పులు చేసినా టీచర్లు ఏమీ అనేవారు కాదు. మిగతా పిల్లలు ఆ పిల్లాడి పట్ల అసూయతో ఉంటారు. టీచర్లు అందర్నీ ఒకలా, మనోజ్‌ను మరోలా చూస్తారు అని అనుకునేవారు. ఎలాగైనా మనోజ్‌ను ఏదైనా తప్పులో ఇరికించి టీచర్ల దష్టిలో పడేటట్లు చెయ్యాలని చూసేవారు. ఆ తప్పుకు మనోజ్‌ను ఏమీ అనకపోతే అప్పుడు టీచర్లను నిలదియ్యొచ్చని వాళ్ళ ఆలోచన. ఒకరోజు తెలుగు టీచర్ హోమ్ వర్క్ ఇచ్చి పూర్తి చేసి రాకపోతే గోడకుర్చీ వేయిస్తాను అని అంటాడు. మరుసటి రోజు అందరూ తరగతిలోకి వస్తారు. మనోజ్ కూడా ఎప్పటిలా వచ్చేసి, అందరితో కలిసి ప్రార్థన కోసం మైదానం వెళ్తాడు. అందరూ బయటికి వెళ్లడం చూసి సందీప్ అనే పిల్లోడు మనోజ్ నోట్ బుక్ దాచేస్తాడు. క్లాస్ మొదలై టీచర్ వచ్చి అందరి హోమ్ వర్క్ చూస్తూ ఉంటాడు.
మనోజ్ వంతు రాగానే తన నోట్ బుక్ కనబడక వెతుకుతుంటాడు. టీచర్ మనోజ్‌ని పిలవగానే ఉన్న విషయం చెప్తాడు. టీచర్ హోమ్ వర్క్ చెయ్యని వారిని గోడ కుర్చీ వేయించినట్లే, మనోజ్ ని కూడా గోడ కుర్చీ వేయిస్తాడు. అరగంటసేపు అలా కూర్చొని ఇబ్బంది పడతాడు మనోజ్. చివరికి ఆ టీచర్ వెళ్లిపోయాక ఏడుస్తూ కూర్చుంటాడు మనోజ్. అది గమనించి ఆ నోట్ బుక్ దాచిన సందీప్ తిరిగి మనోజ్ కి ఇస్తాడు. తాను తప్పు చేసానని, టీచర్ ఏం చేస్తాడో చూద్దాం అని అలా చేశాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు అంటాడు. క్లాస్ దాటి ఇంకా పూర్తిగా బయటకి వెళ్ళని టీచర్ అది గమనించి, మాకు అందరూ సమానమే, బాగా చదివే వాడిని మెచ్చుకుంటాం కానీ తప్పు చేస్తే ఎవరినీ వదలం. అందరూ మనోజ్‌లా ఉండాలనే అనుకుంటాం. కాబట్టి అందరూ అలా కష్టపడితే మాకు కూడా సంతోషమే కదా, మీ మీద మాకెందుకు కోపం వస్తుంది అంటాడు. నిజమే కదా అని పిల్లలందరూ తమ తప్పును ఒప్పుకుంటారు. మనోజ్‌లా మేము కూడా కష్టపడి చదువుకుంటాం అని ఆ టీచర్‌కి మాట ఇస్తారు. సంతోషంగా వెళ్తాడు టీచర్.
టి. కల్యాణ్ రాం
9 వ తరగతి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
దేవరకద్ర, మహబూబ్ నగర్
గురువుకే పరీక్ష
- Advertisement -
- Advertisement -



