Sunday, June 14, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికా నుంచి కనీసం పశ్చాత్తాపం లేదు:రాహుల్ గాంధీ

అమెరికా నుంచి కనీసం పశ్చాత్తాపం లేదు:రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ ప్రభుత్వంపై ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.

“అమెరికా దాడుల్లో మన ముగ్గురు నావికులు చనిపోయి కొద్ది రోజులే అయింది. అయినా ఇంతవరకు వారి నుంచి కనీసం పశ్చాత్తాపం లేదు, క్షమాపణ లేదు. పైగా, మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. “అమెరికా సైన్యం ఆదేశాలను తక్షణమే పాటించాలి. ఎలాంటి ఉల్లంఘనలైనా సహించేది లేదు” అన్న వారి మాటలు చూడండి. ఒక స్వతంత్ర దేశం ఇలాంటి భాషను ఎప్పటికీ సహించదు. కానీ మన బలహీన ప్రధాని మాత్రం నోరు మెదపడం లేదు. ఒక విధేయుడైన సేవకుడిలా వారి ఆదేశాలను వింటున్నారు, పాటిస్తున్నారు. ఈ బలహీన ప్రధాని దేశ గౌరవాన్ని కాపాడలేరు. ఎందుకంటే, దేశాన్ని అవమానించే వాళ్లే ఆయన నియంత్రణలో ఉన్నారు. అందుకే మన వాళ్లను చంపినా, మనల్ని అవమానించినా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఇది దేశ ప్రజలందరూ గమనించాలి” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -