Monday, June 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘనంగా రాజుబాబు జయంతి వేడుక

ఘనంగా రాజుబాబు జయంతి వేడుక

- Advertisement -

టీవీ, సినిమా నటుడు రాజుబాబు జయంతిని ప్రతీ సంవత్సరం ఆయన మిత్రులు జరపటం ఎంతో సముచితంగా ఉందని, ఇది అందరికీ మార్గదర్శనం కావాలని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. టి.వి., సినిమా నటుడు రాజుబాబు 69వ స్మారక అవార్డుల కార్యక్రమం శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు టి.డి. జనార్థన్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ,’రాజబాబు జయంతిని ఆయన మిత్రులు జరపటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ప్రతీ వారికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నానుఅని అన్నారు. 'రాజుబాబు జయంతి వేడుకలకు ప్రతీ సంవత్సరం నేను హాజరవుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి అవసరం అని దర్శకుడు బి. గోపాల్ చెప్పారు. దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ,’రాజుబాబు జయంతి వేడుకలు ఆయన మిత్ర బృందం ఎంతో స్ఫూర్తిధాయకంగా నిర్వహిస్తున్నారు` అని తెలిపారు. దర్శకులు ఎ. కోదండ రామిరెడ్డి, ప్రదీప్, కాదంబరి కిరణ్ కుమార్, ఎస్.పి. నాగేశ్వరరావు, కోట శంకర రావు, గీతా భాస్కర్, మేఘన ముసునూరి, శశాంక్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మల్లిఖార్జున రావు నిర్వహించగా, కాకాని బ్రహ్మం స్వాగతం పలికారు. రమేష్ వందన సమర్పణ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -