వేసవి సెలవులు పూర్తవడంతో ఈరోజు నుండి స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. సమ్మర్ హాలీడేస్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన పిల్లలు బడిబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే తమ చిన్నారులను మొదటిసారి బడికి పంపాలని చాలా మంది పేరెంట్స్ ఆలోచన చేస్తుంటారు. పిల్లలను ఫస్ట్ టైమ్ స్కూల్‌కు పంపడం అంటే ఏదో నాలుగు పుస్తకాలు కొని బ్యాగ్‌లో సర్దడం కాదు. తల్లిదండ్రులుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
పిల్లలను ఎంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసినా, అక్కడ ఎన్ని హంగులు ఉన్నా.. తల్లిదండ్రులుగా మీరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా వారికంటూ కొన్ని విషయాలు అర్థమయ్యేలా చేయాలి. అప్పుడే వారు బడికి వెళ్లడానికి మారాం చేయరు. త్వరగా సర్దుకుపోగలుగుతారు.
షేరింగ్ నేర్పించండి
ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న పిల్లలకు ఇంట్లోని ప్రతి వస్తువూ తనదే అనే భావనం ఉంటుంది. కానీ బడిలో అది కుదరదు. కాబట్టి, ఇంట్లోనే ఆటల ద్వారా ‘ఇది నీ బొమ్మ, అది నా బొమ్మ మార్చుకుని ఆడుకుందాం’ అంటూ షేరింగ్ నేర్పించడం చేయాలి. అలాగే లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం కూడా అలవాటు చేయాలి. తోటి వారితో షేర్ చేసుకోవడం ఒక ‘ఫ్రెండ్‌షిప్ డీల్’ గా చెప్పాలి. ఇది చిన్నారుల మధ్య ఫ్రెండ్షిప్ను పెంచి, ఇంటి బెంగను త్వరగా దూరం చేస్తుంది.
అలా అనొద్దు
పిల్లలు అన్నం తిననని మారాం చేస్తుంటే, అల్లరి చేస్తుంటే చాలా మంది టీచర్‌తో చెప్పి కొట్టిస్తా అని భయపెడుతుంటారు. కానీ ఇలా చేయొద్దు. ఎందుకంటే మీరు అలా చెప్పడం వల్ల వారికి స్కూల్ అంటే జైలులా, టీచర్ విలన్లా కనిపిస్తారు. అలాకాకుండా టీచర్ అంటే మనకు హెల్ప్ చేసే ‘సూపర్ హీరో’ అంటూ వారిలో పాజిటివ్ ఇమేజ్ బిల్డ్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే 20-30 మంది పిల్లల మధ్య టీచర్‌కి తన అవసరం అర్థం కావాలంటే నోరు తెరిచి అడగడం నేర్పించాలి. వాటర్ కావాలన్నా, టాయిలెట్ వస్తున్నా సైగలు చేయకుండా స్పష్టంగా అడగడం ఇంట్లోనే ప్రాక్టీస్ చేయించాలి.
అలవాటు చేయాలి
బడి ఓపెన్ కావడానికి కనీసం వారం పది రోజుల ముందే చిన్నారుల డైలీ రొటీన్ కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం మార్నింగ్ నిద్రలేపి టైమ్‌కు టిఫెన్ తినడం, యూనిఫామ్, షూస్, బెల్ట్, టై వేసి కాసేపు ఇంట్లో కూర్చోబెట్టడం వంటివి చేయాలి. ఈ ఫిజికల్ చేంజ్‌కి పిల్లల బాడీ ట్యూన్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే ఆ ఇరిటేషన్‌తో బడిలో ఏడ్చే అవకాశం ఉంటుంది. అలాగే దుస్తులు ఎలా విప్పాలో, ఎలా వేసుకోవాలో కూడా నేర్పించాలి.
బాక్సు ఓపెన్ చేయడం
లంచ్ బాక్స్ మూత, వాటర్ బాటిల్ క్యాప్స్ వాళ్లంతట వాళ్లే ఓపెన్ చేసుకునేలా నేర్పించాలి. లేదంటే ఆకలి వేసినా బాక్స్ ఓపెన్ చేయడం రాక, అడగలేక అలాగే ఉంటారు. అలాగే లంచ్ బ్యాగ్‌లో చాక్లెట్, బిస్కెట్, స్మైలీ ఇలా రోజుకో చిన్న చిన్న స్నాక్స్ పెట్టండి. క్లాస్‌లో బోర్ కొట్టినప్పుడు లేదా మమ్మీ గుర్తుకొచ్చినప్పుడు ఆ బాక్స్ తీయగానే ఆందోళన మర్చిపోతారు. నెక్ట్స్ డే ఏం పెడతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తారు.
ఆ విషాయాల్లో కంగారొద్దు
స్కూల్ స్టార్టింగ్ డేస్‌లో బడి నుంచి రాగానే షర్టు మీద సాంబార్ మరకలతో, మోకాలికి దుమ్ముతో వస్తే ఇరిటేట్‌గా ఫీల్ అవ్వకండి. వాళ్లు కొత్త ‘లైఫ్’ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ కొన్ని రోజులు ఏడ్చినా, లంచ్ బాక్స్ తినకుండా తెచ్చినా కంగారొద్దు, ఇది చాలా కామన్ అని అర్థం చేసుకోవాలి.
ఇవి కూడా చేయండి
స్కూల్లో పిల్లలందరి బాటిల్స్, బ్యాగులు ఒకేవిధంగా ఉంటుంటాయి. అందుకే మీ చిన్నారుల వస్తువులపై మార్కర్‌తో వారి పేరు, మీ ఫోన్ నెంబర్ రాయండి. ఎప్పుడూ బ్యాగ్‌లో ఒక జత అదనపు బట్టలు ఉంచేలా చూసుకోండి. ఎందుకంటే, ఒకవేళ పొరపాటున బట్టలు తడిచినా, మురికి చేసుకున్నా ఛేంజ్ చేయడానికి పనికొస్తాయి. అలాగే మీ పాప/బాబుకి ఏదైనా డస్ట్ అలర్జీ లేదా హెల్త్ ఇష్యూ ఉంటే ముందే క్లాస్ టీచర్‌కి, ఆయాలకి ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడే వారు మీ పిల్లల తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
మొదటిసారి బడికి పంపుతున్నారా..?
- Advertisement -
- Advertisement -


