– కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : నిత్యం యోగా సాధనతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంతో లభించటంతో పాటు మానసిక ప్రశాంతత సాధించవచ్చని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 54 వారాల యోగా అభ్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి.. యోగా బోధించిన గురువులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. నల్లకుంటలోని శంకర్‌మఠ్ వేదికగా 2025 ఫిబ్రవరి 9న మొదలైన 54 వారాల యోగా అభ్యాసం ఈ నెల 14న ముగిసింది. వేగంతో కూడిన ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని తొలగించేందుకు, ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా గొప్ప సాధనమని యోగా గురువు ఓ ప్రకాశ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రవిశంకర్ పల్లె, లోకా ఫౌండేషన్ చైర్మన్ సుధీర్ కుమార్ సహా యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు.
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



