Monday, June 15, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థుల చదువుకు ఆదిలోనే ఆటంకం

విద్యార్థుల చదువుకు ఆదిలోనే ఆటంకం

- Advertisement -

వర్షానికి కూలిన పాఠశాల గదుల దుస్థితి
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలోని ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వరసగా కురుస్తున్న వర్షాలకు తరగతి గదుల గోడలు కూలిపోయాయి. పాఠశాల గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం సోమవారం పున ప్రారంభం అయ్యాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ గదులు మాత్రం రెండే ఉన్నాయి. ప్రమాదపు అంచులలో విద్యార్థులకు బోధన చేయవలసిన పరిస్థితి నెలకొంది. భోజన గది కూడా పూర్తిగా కూలిపోవడంతో మధ్యాహ్నం భోజనాలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాల (స్లాబ్) చెత్తు కూడా పెచ్చులు ఊడి పడుతోంది.

పిల్లలకు రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పాఠశాల హెడ్ మాస్టర్ స్వప్న వివరాలను తెలుపుతూ.. ఇటీవల కురిసిన వర్షానికి తరగతి గదులు కూలిపోయాయి. వంటగది కూడా కూలిపోవడంతో పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజనం చేయడం కష్టంగా ఉందని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా సురక్షితమైన వాతావరణం తరగతి గదులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను, పాలకులను కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల వివరాలను సేకరించి మరమ్మతులు చేయవలసిన బాధ్యత అధికారులపై పాలకులపై ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -