- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కడలూరు సమీపంలో సోమవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ లారీని కారు బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



