బెర్న్ : దేశ జనాభాను కోటికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనను స్విట్జర్లాండ్ ఓటర్లు తిరస్కరించారు. జనాభాలో 60 శాతం మంది ఓటింగులో పాల్గనగా వారిలో 55 శాతం మంది ప్రతిపాదనను తిరస్కరించారు. 45 శాతం మంది సమర్ధించారు. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిన స్వీస్ పీపుల్స్ పార్టీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. దీనిని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు, ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. 2002లో స్విట్జర్లాండ్ జనాభా 73 లక్షలు. ఆ తర్వాత అది వేగంగా పెరుగుతూ ఇప్పుడు 91 లక్షలకు చేరింది. అయితే వీరిలో 27 శాతం మంది ఆ దేశానికి చెందిన వారు కారు. కాగా జనాభాపై పరిమితి విధిస్తే రవాణా, గృహవసతి, పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుందంటూ పీపుల్స్ పార్టీ చేసిన వాదన మెజారిటీ ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
జనాభాపై పరిమితిని తిరస్కరించిన స్విట్జర్లాండ్ ఓటర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



