Monday, August 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాతో బలపడుతున్న సంబంధాలు

రష్యాతో బలపడుతున్న సంబంధాలు

- Advertisement -

పుతిన్‌కు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సందేశం
ప్యాంగ్యాంగ్‌ : రష్యాతో సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ లంగిపోయిన కారణంగా వలస పాలన నుంచి ఉత్తర కొరియా స్వాతంత్య్రం పొందిన సంగతి తెలిసిందే. జపాన్‌ లంగుబాటుకు గుర్తుగా జరిగిన 81వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కిమ్‌కు అభినందనలు తెలుపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం ఓ సందేశం పంపారు.
దీనికి కిమ్‌ సమాధానం ఇస్తూ సోవియట్‌ సైనికులు జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు స్నేహబంధం ఏర్పడిందని, అది మరింత బలపడి అన్ని రంగాలలో సహకారం కొనసాగుతోందని తెలిపారు. న్యాయం కోసం సాగించిన ఉమ్మడి పోరాట చరిత్రను, స్నేహబంధం యొక్క విలువైన సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయిన ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విమోచన వార్షికోత్సవం సందర్భంగా సద్భావనా పర్యటన కోసం రష్యా నౌక ‘పల్లాడా’ ఉత్తర కొరియాలోని వాన్సాన్‌ ఓడరేవుకు చేరుకుంది. ఉత్తర కొరియా ప్రాంతీయ అధికారులు, రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది ఆ నౌకకు స్వాగతం పలికారు. ఇదిలావుండగా శాంతియుత సహజీవనం కోసం ఉత్తర కొరియాతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నదని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ అభిప్రాయపడ్డారు.
ఘర్షణల నివారణకు ఉభయ కొరియాల మధ్య రక్షణ చర్యలు అవసరమని సియోల్‌ విమోచనా దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అన్నారు. అయితే లీ అభిప్రాయంతో ఉత్తర కొరియా ఏకీభవించలేదు. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు తనను రెచ్చగొట్టేందుకు ఉద్దేశించినవేనని విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -