Sunday, September 6, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్లో సాత్విక్‌ జోడీ

ఫైనల్లో సాత్విక్‌ జోడీ

- Advertisement -

సెమీస్‌‌లో మలేషియా షట్లర్లపై గెలుపు
చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750

షెంజెన్‌ (‌చైనా) : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ ‌జోడీ సాత్విక్‌‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ ‌శెట్టిలు చైనా మాస్టర్స్‌ ‌సూపర్‌ 750 ‌టోర్నమెంట్‌ ‌ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ‌సెమీఫైనల్లో మలేషియా షట్లర్లు నూర్‌ ‌మహ్మద్‌, టాన్‌ ‌వీ కియాంగ్‌‌లపై సాత్విక్‌, చిరాగ్‌‌లు 21-16, 18-21, 21-11తో మూడు గేముల మ్యాచ్‌‌లో విజయం సాధించారు. సెమీస్‌‌లో మెరుపు విజయంతో ఈ సీజన్లో మూడోసారి సాత్విక్‌, చిరాగ్‌ ‌జోడీ టైటిల్‌ ‌పోరుకు చేరుకుంది. మలేషియా షట్లర్లతో సెమీఫైనల్‌ ‌పోరులో సాత్విక్‌, చిరాగ్‌‌లకు ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి గేమ్‌‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయిన సాత్విక్‌, చిరాగ్‌‌లు 0-5తో నిలిచారు. వరుసగా ఏడు పాయింట్లు సాధించి జోరందుకున్న మనోళ్లు 7-5తో ముందంజ వేశారు. ద్వితీయార్థంలోనూ అదే జోరు కొనసాగించి తొలి గేమ్‌‌ను 21-16తో సొంతం చేసుకున్నారు. కానీ కీలక రెండో గేమ్‌‌లో మలేషియా ద్వయం పుంజుకుంది. 21-18తో రెండో గేమ్‌‌ను గెల్చుకుని మ్యాచ్‌‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో దూకుడుగా ఆడిన సాత్విక్‌, చిరాగ్‌‌లు 21-11తో ఏకపక్ష విజయం సాధించారు. 66 నిమిషాల్లోనే ఫైనల్లో బెర్త్‌ ‌ఖాయం చేసుకున్న సాత్విక్‌, చిరాగ్‌‌లు నేడు టైటిల్‌‌పై కన్నేసి బరిలోకి దిగనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -