Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసర్దార్ కంటే పదిరెట్ల ఎక్కువ..

సర్దార్ కంటే పదిరెట్ల ఎక్కువ..

- Advertisement -

తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి మీడియాతో ముచ్చటించారు. మనకి ప్రపంచంలో ప్రాచీన నాగరి కత నుంచి యుద్ధం జరిగినప్పుడు ఒక దేశానికి మరో దేశానికి వాటర్ కనెక్షన్ ఆపేసేవారు. నీరే మనకి జీవం. అలా వాటర్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు అందరికీ అది చాలా కొత్త విషయం అనిపిం చింది. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. -ఇది సొసైటీ కోసం ఒక గూఢచారి చేస్తున్న వార్. వాటర్ కమర్షియల్ కాకూడదని అతను చేస్తున్న పోరాటం. దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్‌కి చాలా లేయర్స్ ఉన్నాయి. సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు ‘సర్దార్’ మళ్లీ ఎందుకు తిరిగి వచ్చాడు అనేది ఒక గొప్ప ఆలోచనతో డైరెక్టర్ వచ్చారు. అలాగే దాంతో పాటు విలన్ క్యారెక్టర్ కూడా దొరికిందని చెప్పారు. ఆ క్యారెక్టర్ ఎస్జే సూర్య చేశారు. ‘సర్దార్’లో వాటర్ కాన్సెప్ట్ మీకు ఎలా ఇంపాక్ట్ చేసిందో.. దానికి పది రెట్లు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఇది ఉంటుంది. ‘సర్దార్’ సినిమాని తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆదరించారు. -మనకి ఈ మధ్యకాలంలో స్పై యూనివర్స్‌లో ‘దురంధర్’ సినిమా వచ్చింది. కాకపోతే దాని కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ‘సర్దార్ 2’లో కూడా కాన్సెప్ట్ పరంగా, విజువల్ పరంగా చాలా హై స్టాండర్డ్‌లో ఉండబోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -