Saturday, September 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త తరహాలో ఉండే సినిమా

కొత్త తరహాలో ఉండే సినిమా

- Advertisement -

నమో జయం ప్రొడక్షన్స్‌ పతాకంపై నవీన్‌ దేశ బోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌’. జయంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్‌ స్కూల్‌ టీచర్‌గా నటించటం విశేషం. దివ్య ప్రవీణ్‌ బొలిశెట్టి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను టీచర్స్‌ డే సందర్భంగా జాతీయ అవార్డు పురస్కారం అందుకున్న టీచర్‌ మారం పవిత్ర చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జయంత్‌ మాట్లాడుతూ,‘ఇదో కొత్త తరహ చిత్రం. మనం రోజు స్కూల్లో ఎదుర్కొనే సమస్యలతో పాటు విద్యావ్యవస్థ గురించి మా సినిమాలో చెప్పాం’అని అన్నారు. ‘ఈ సినిమా చేసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఇది మలయాళ సినిమా ‘ఫిలిప్‌ అండ్‌ ది మంకీ పెన్‌’ అనే చిత్రం రీమేక్‌. మల యాళంలో 111 రోజలు ఆడి, ఘన విజయం సాధించింది. ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉండ టంతో అంత పెద్ద విజయం సాధించింది’ అని దర్శకుడు నవీన్‌ దేశబోయిన తెలిపారు. సత్యం రాజేష్‌ మాట్లాడుతూ,‘ఈ సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ‘నా ఉద్ధేశ్యంలో స్కూలే దేవాలయం. టీచర్సే దేవుళ్లు అని నమ్ముతాను. అందుకే మా సినిమా ఓపెనింగ్‌ ఇక్కడే చేశాం. ఇది నాకు, నా భర్త ప్రవీణ్‌కు ఎంతో గర్వకారణం’ అని నిర్మాత దివ్య చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -