Saturday, September 5, 2026
E-PAPER
Homeక్రైమ్వంట చేయలేదని భార్యను చంపిన భర్త..!

వంట చేయలేదని భార్యను చంపిన భర్త..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నాగ్‌పూర్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లాలనే ఉద్దేశంతో వంట చేయడానికి నిరాకరించిన భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలు పోస్టుమార్టం నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళితే, కృష్ణ లాల్ యాదవ్ (41) పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాక, భార్య యామిని (38)ని తనకు, ఇద్దరు పిల్లలకు భోజనం సిద్ధం చేయమని కోరాడు. అయితే, తమ హౌసింగ్ సొసైటీలో నిర్వహించే డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న యామిని వంట చేయడానికి నిరాకరించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఉన్న కృష్ణ లాల్ ఆవేశంతో ఊగిపోతూ, పిల్లల కళ్లెదుటే యామిని మెడ, పొత్తికడుపు భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి జరిగిన కొద్దిసేపటికే యామిని ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్రమైన అంతర్గత గాయాల కారణంగా కడుపు భాగం ఉబ్బిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యామిని మరణించింది.

పోలీసులు తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మెడ ఎముక విరగడం, గొంతు నులిమిన గుర్తులు ఉండటంతో పాటు ప్రేగులకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును హత్యగా మార్చి నిందితుడు కృష్ణ లాల్‌ను అరెస్ట్ చేశారు. గతంలోనూ వారి మధ్య గొడవలు జరిగేవని, అయితే అది తమ కుటుంబ వ్యవహారమని, ఎవరూ జోక్యం చేసుకోవద్దని యామిని కోరడంతో తాము దూరంగా ఉన్నామని ఆమె సోదరుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -