నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు (Asian Game 2026) జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో క్రికెట్ ఆటగాళ్ల(మెన్ అండ్ ఉమెన్) వసతుల విషయంలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) తిరస్కరించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఈ క్రీడల్లో వసతి సదుపాయాలు, క్రికెట్ మైదానంలోని పిచ్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆటగాళ్లు ఉండేందుకు చాలా చిన్న గదులను సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో సొంతంగా వసతి కల్పించుకుంటామంటే ఐవోఏకు అభ్యంతరం లేదు. ఐవోఏ మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించదని అయ్యర్ చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ఆసియా క్రీడలు: బీసీసీఐ ప్రతిపాదనను తిరస్కరించిన ఐవోఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



