– ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రామకృష్ణ
– కార్మికులకు సంఘ నెంబర్ స్టిక్కర్లు పంపిణీ
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి న్యూ బస్టాండ్ ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు సౌకత్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిమ్మటూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే రూ.12 వేల ఆర్థిక సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల రక్షణకు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ప్రత్యేక సంక్షేమ బోర్డు లేదా చట్టాన్ని ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఆటో అడ్డాలోని వాహనాలకు ఏఐటీయూసీ లోగో, సీరియల్ నెంబర్‌తో కూడిన స్టిక్కర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.కే. యాకూబ్, సహాయ కార్యదర్శి రమేష్, కోశాధికారి కె. మురళి పాల్గొన్నా రు. కమిటీ సభ్యులు ఎస్.కే. జానీ, సి.హెచ్. చందు, కె. నాగరాజు, కె. వెంకట్రావు, జి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



